logo

ప్రలోభాలపై నిఘా వ్యవస్థ ప్రత్యేక దృష్టి

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న దృష్ట్యా విధి నిర్వహణలో యంత్రాంగం మరింత నిబద్ధతతో వ్యవహరించాలని, ప్రలోభాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని

Published : 28 Apr 2024 03:59 IST

యంత్రాంగానికి సూచనలిస్తున్న ఎన్నికల పరిశీలకులు బాల సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న దృష్ట్యా విధి నిర్వహణలో యంత్రాంగం మరింత నిబద్ధతతో వ్యవహరించాలని, ప్రలోభాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు కె.బాలసుబ్రహ్మణ్యం, కమల్‌కాంత్‌ సరోఛ్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో పలు సూచనలు చేశారు. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేకుండా జరిగేలా చూడాలన్నారు. కమల్‌కాంత్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. వ్యయ పరిశీలకులు రోహిత్‌నగర్‌, జైఅరవింద్‌, నితిన్‌కురియన్‌, పోలీసు పరిశీలకుడు బలరామ్‌మీనా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ జగదీష్‌, నియోజవర్గాల రిటర్నింగ్‌, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని