logo

నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి

బాపట్ల లోక్‌సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్లో ప్రకటించారు

Published : 20 Apr 2024 05:29 IST

సొంతంగా కారు లేదు

 ఆస్తులు రూ.15.93 కోట్లు

 

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల లోక్‌సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్లో ప్రకటించారు. కృష్ణప్రసాద్‌ పేరుతో రూ.1,99,18,696.95 విలువైన చరాస్తులు, రూ.7,31,85,000 స్థిరాస్తులు కలిపి మొత్తం రూ.9,31,03,697.05 విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. సతీమణి బి.శిరీషకుమారికి రూ.1,50,51,660 విలువైన చరాస్తులు, రూ.5,11,50,000 విలువ కలిగిన స్థిరాస్తులు కలిపి మొత్తం రూ.6,62,01,660 ఆస్తులు ఉన్నట్లుగా చూపించారు. కృష్ణప్రసాద్‌పై ఎలాంటి కేసులు లేవు. రుణాలు లేవని అఫిడవిట్లో చూపించారు. ఆయన సతీమణి పేరిట బ్యాంకులో రూ.1.94 కోట్ల రుణం ఉంది. తన చేతిలో రూ.5 లక్షలు, భార్య వద్ద రూ.5 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. కృష్ణప్రసాద్‌కు రూ.6.66 లక్షల విలువైన వంద గ్రాముల బంగారు ఆభరణాలు, సతీమణి శిరీషకుమారికి రూ.60.66 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. సొంతంగా కారు లేదని పేర్కొన్నారు. విద్యార్హతగా ఆర్‌ఈసీ(నిట్‌) వరంగల్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదివినట్లు తెలిపారు. సివిల్స్‌లో విజయం సాధించి ఐపీఎస్‌ అధికారిగా ఎంపికై డీజీపీ హోదాలో పదవీ విరమణ చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని