logo

‘పది’లో ‘ప్రత్యేక’ విజయం

అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్‌ పదో తరగతి పూర్తిచేసింది.

Published : 25 Apr 2024 05:12 IST

మానసిక ఎదుగుదల లేకపోయినా ఉత్తీర్ణురాలైన విద్యార్థిని

అమ్మమ్మతో జి. శ్రావ్య జోసెఫిన్‌

దుగ్గిరాల, న్యూస్‌టుడే: అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్‌ పదో తరగతి పూర్తిచేసింది. దుగ్గిరాలలో ఫిజియో క్లినిక్‌ నిర్వహించే ఫిజియోథెరపిస్టు డాక్టర్‌ కమల కుమార్తె అయిన శ్రావ్యకు వైద్య పరిభాషలో అటెన్షన్‌ డిఫిసిట్ హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) అనే వ్యాధి ఉంది. దీంతో బాధపడేవారికి సాధారణ బాలికల మాదిరిగా మానసిక ఎదుగుదల ఉండదు. శ్రావ్య పాఠాలు విని గుర్తుపెట్టుకోగలతు కానీ రాయలేదు. ఆమెలోని విషయ పరిజ్ఞాన గ్రాహ్యతను గుర్తించిన తల్లి ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు వినిపించేది. దుగ్గిరాలలోని భవిత కేంద్రం శిక్షకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో ఒకటో తరగతి నుంచి పది వరకు నిరాటంకంగా చదువు కొనసాగింది. ఈ ఏడాది జరిగిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 9వ తరగతి చదివే బాలికను సహాయకురాలిగా ఏర్పాటు చేసుకుని శ్రావ్య పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. ఆమెను ఎంఈవోలు కాజ శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ అభినందించారు. శ్రావ్యను గుంటూరులోని సెయింట్ ఆన్స్‌లో ఇంటర్‌లో చేర్పించనున్నట్లు ఆమె తల్లి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు