logo

పాస్‌పోర్టు ప్రత్యేక డ్రైవ్‌లో 3200 అపాయింట్‌మెంట్లు

పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనకు శనివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌ విజయవంతమైంది.

Published : 04 Dec 2022 01:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనకు శనివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌ విజయవంతమైంది. తత్కాల్‌ కింద పాస్‌పోర్టు దరఖాస్తుల సమర్పణకు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు హైదరాబాద్‌ ఆర్‌పీవో పరిధిలోని 5 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు(పీఎస్‌కేలు), 14 పీవో పీఎస్‌కేలు సెలవు రోజైన శనివారం పనిచేశాయి. 3200 పూర్తి అపాయిమెంట్లు విడుదల చేసినట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. అమీర్‌పేట పీఎస్‌కే వద్ద ఆందోళనకు దిగిన ఇద్దరు వ్యక్తులను స్థానిక పోలీసుస్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని