logo

గజల్‌ శ్రీనివాస్‌కు ‘సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం’

ప్రముఖ గజల్‌ గాయకుడు డా. గజల్‌ శ్రీనివాస్‌కు ‘సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం’ జరిగింది.

Published : 01 May 2023 12:39 IST

ఇండోర్‌: ప్రముఖ గజల్‌ గాయకుడు డా. గజల్‌ శ్రీనివాస్‌కు ‘సంత్ కబీర్ సూఫీ గాయక సత్కారం’ జరిగింది. సంత్‌ కబీర్‌ ఉత్సవ్‌ సందర్భంగా ఏప్రిల్‌ 30న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్వరంగిణీ సంగీత సంస్థ, స్వరంగిణీ జన వికాస సమితి ఆధ్వర్యంలో కబీర్‌ దోహే, సూఫీ గజల్‌ గానం కార్యక్రమం నిర్వహించారు.

డా.గజల్ శ్రీనివాస్ ఆలపించిన కబీర్ దోహే, సూఫీ ఉర్దూ గజల్ గానం  ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసిందని.. వారాణాసికి చెందిన తానా బానా మ్యూజిక్ బ్యాండ్ కబీర్ సాహిత్య గానం శ్రోతలను ఆకట్టుకుందని నిర్వాహకులు గురు చరణ్ దాస్, అంజన్ సక్సేనా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇండోర్‌ ఆకాశవాణి డైరెక్టర్‌ సంతోష్ అగ్నిహోత్రి  గజల్‌ శ్రీనివాస్‌కు ‘సంత్ కబీర్ సూఫీ గాయక  సత్కారం' అందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు