logo

Hyderabad: భార్యను బెదిరించాలనుకుని.. నిజంగానే ఉరేసుకున్నాడు

భార్యను బెదిరించాలన్న ఉద్దేశంతో ఉరేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి చనిపోయిన ఘటన ఇది జవహర్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....శ్రీకాకుళం జిల్లాకు చెందిన సెంట్రింగ్‌ కార్మికుడు సింహాద్రి నాగరాజు (36), మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు.

Updated : 08 Mar 2024 08:11 IST

జవహర్‌నగర్‌: భార్యను బెదిరించాలన్న ఉద్దేశంతో ఉరేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి చనిపోయిన ఘటన ఇది జవహర్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....శ్రీకాకుళం జిల్లాకు చెందిన సెంట్రింగ్‌ కార్మికుడు సింహాద్రి నాగరాజు (36), మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. బాలాజీనగర్‌ చంద్రపురికాలనీకి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. నాగరాజును రెండో వివాహం చేసుకుంది. నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. తరచూ ఆమెను వేధిస్తున్నాడు. మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానని తరచూ భార్యను బెదిరించేవాడు. ఈనెల 6న మద్యం తాగి ఇంటికి రాగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్య పిల్లలతో దమ్మాయిగూడలోని అమ్మమ్మ వద్దకు వెళ్లింది. గురువారం ఉదయం ఇంటికొచ్చేసరికి తాళం వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా భర్త ఉరివేసుకున్నట్లు గుర్తించింది. తనను భయపెట్టే క్రమంలోనే చనిపోయిన ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.


తండ్రి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య

నాగోలు: తండ్రి మరణాన్ని జీర్జించుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై లింగారెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్‌కు చెందిన బాసని శ్రీనివాస్‌- సునీత దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్‌ బతుకుదెరువు కోసం కుటుంబంతో వచ్చి మన్సూరాబాద్‌ సాయిసప్తగిరి కాలనీలో ఉంటున్నాడు. సునీత వనస్థలిపురంలోని ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఇంటర్‌ చదివిన కుమార్తె కీర్తన(20)కు పెళ్లి నిశ్చయమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్‌ మూడు నెలల క్రితం హఠాత్తుగా మృతిచెందాడు. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్న కీర్తన.. గురువారం ఇంట్లో ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని