logo

హోరాహోరీగా ఉప ఎన్నిక

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌కు రంగం సిద్ధమైంది.

Published : 13 May 2024 02:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 232 పోలింగ్‌ కేంద్రాల్లో 2,53,706 మంది ఓటర్లు ఓటేయనున్నారు. మల్కాజిగిరి లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఇక్కడ ఎన్నిక జరగనుంది.

2023 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రహదారి ప్రమాదంలో అకాల మరణంతో కంటోన్మెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. భారాస తరఫున దివంగత ఎమ్మెల్యే సోదరి నివేదిత పోటీలో ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి శ్రీనగేశ్‌, భాజపా అభ్యర్థిగా టి.ఎన్‌.వంశ తిలక్‌ బరిలో ఉన్నారు. సానుభూతిపైనే భారాస అభ్యర్థి ఆశలు పెట్టుకుంది. పార్టీ శ్రేణులు పట్టుదలతో పనిచేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసిన శ్రీ నగేశ్‌.. పార్టీ మారి ఈసారి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలు, సొంత క్యాడర్‌ను నమ్ముకున్నారు.  భాజపా అభ్యర్థి వంశ తిలక్‌ మోదీ చరిష్మాపై నమ్మకం పెట్టుకున్నారు.కాగా క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశం ఉందని నేతలు అంటున్నారు.అసెంబ్లీలో మీకు వేస్తాం.. పార్లమెంట్‌లో మాకు వేయాలనే ఒప్పందంలో రెండు పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చాయనే ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు