logo

Laziness: నిద్రలేమితో ఉద్యోగుల్లో బద్ధకం

నిద్రలేమితో సతమతమవుతున్న నగరవాసుల్లో 56 శాతం మంది పనివేళల్లో నిద్రమత్తుతో బద్ధకంగా ఉంటున్నారని ‘వేక్‌ఫిట్‌ గ్రేట్‌ ఇండియన్‌ స్లీప్‌ స్కోర్‌కార్డ్‌ 2024’ సర్వే వెల్లడించింది.

Updated : 22 Mar 2024 07:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిద్రలేమితో సతమతమవుతున్న నగరవాసుల్లో 56 శాతం మంది పనివేళల్లో నిద్రమత్తుతో బద్ధకంగా ఉంటున్నారని ‘వేక్‌ఫిట్‌ గ్రేట్‌ ఇండియన్‌ స్లీప్‌ స్కోర్‌కార్డ్‌ 2024’ సర్వే వెల్లడించింది. హైదరాబాద్‌ నగరంలో 10వేల మంది ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి నగరవ్యాప్తంగా స్లీప్‌ ట్రెండ్స్‌ వివరాలను వెల్లడించింది. 91శాతం మంది నిద్రకు ఉపక్రమించే ముందు సెల్‌ఫోన్లు ఉపయోగిస్తున్నట్టు చెప్పారని పేర్కొంది. నగరవాసుల్లో 36 శాతం మంది రాత్రి 11గంటల తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తున్నారని, 33 శాతం మంది ఇన్‌సోమ్నియా ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నట్టు వెల్లడించారు. షిప్టుల్లో పనిచేయడంతో నిద్రలేమి సమస్య ఉందని 32శాతం మంది పేర్కొన్నారు. ఇందుకు పరిష్కారం.. నిద్రించే వాతావరణం అనువుగా ఉండాలని 59శాతం, సెల్‌ఫోన్‌ను దూరం పెట్టడమే పరిష్కారమని 41శాతం మంది అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి నలుగురిలో ఒకరు నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నట్లు  వెల్లడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు