logo

ఆత్మరక్షణ.. తైక్వాండో శిక్షణ

ఆత్మరక్షణకు తైక్వాండో ఆయుధంలాంటిది.. నేటి పరిస్థితుల్లో చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం పొందాలని చిన్నారులు వారి తల్లిదండ్రులు ఆలోచనలు చేస్తున్నారు. పట్టణంలోని గీతావిద్యాలయంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ

Published : 24 May 2022 04:30 IST

ఉత్సాహంగా  చిన్నారుల సాధన


తైక్వాండో సాధన చేస్తున్న చిన్నారులు

చొప్పదండి, న్యూస్‌టుడే: ఆత్మరక్షణకు తైక్వాండో ఆయుధంలాంటిది.. నేటి పరిస్థితుల్లో చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం పొందాలని చిన్నారులు వారి తల్లిదండ్రులు ఆలోచనలు చేస్తున్నారు. పట్టణంలోని గీతావిద్యాలయంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తైక్వాండో ఉచిత శిక్షణకు వంద మందికి పైగా చిన్నారులు నిత్యం హాజరవుతూ మెలకువలు నేర్చుకుంటున్నారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం నాలుగు గంటల పాటు శిక్షణ పొందుతున్నారు.

పోటీల్లో పాల్గొంటూ..

జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ఉచితంగా తైక్వాండో శిక్షణను నిర్వహిస్తుండటంతో చిన్నారులు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. ఈ వేసవి శిబిరంలో నేర్చుకున్న మెలకువలతోనే సరిపెట్టకుండా దానిని మరింత రాటుదేలే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పాఠశాలల్లో చదువును కొనసాగిస్తూ తైక్వాండోలో శిక్షణ పొందుతున్నారు. పాఠశాల స్థాయిలో జరిగే పోటీలతో పాటు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ పతకాలు కైవసం చేసుకుంటున్నారు.


అందరికి ఉపయుక్తంగా ఉంది
- సాధన, ఆరోతరగతి

తైక్వాండో శిక్షణ నాలాంటి చిన్నారులందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంది. ఆత్మరక్షణ మెలకువలు చెబుతుండటంతో క్రమం తప్పకుండా సాధన చేస్తున్నాను. ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాను. ఈ శిబిరంలో నేర్చుకున్న అంశాలతోనే సరిపెట్టకుండా జాతీయస్థాయిలో పతకాలు సాధించాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నాను.


శారీరకంగా పటిష్ఠంగా తయారవుతున్నాం
- జయశ్రీ, ఐదోతరగతి

ప్రతీరోజు తైక్వాండో శిక్షణ పొందుతుండటంతో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈ శిక్షణతో వేసవి సెలవుల సద్వినియోగంతో పాటు జీవితంలో ఏదైనా సాధించవచ్చనే నమ్మకం ఏర్పడుతుంది. నైపుణ్యాలు పొంది ఉత్తమ ప్రదర్శన చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాను.


ఆరేళ్లుగా ఇస్తున్నాం
- లహరి, శిక్షకురాలు

గత ఆరేళ్లుగా పట్టణంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణను ఇస్తున్నాం. చిన్నారులు ఆసక్తితో శిక్షణ పొందుతుండటంతో ఎంతో ఆనందంగా ఉంది. చాలామంది చిన్నారులు ప్రతి ఏటా రాష్ట్ర, జాతీయస్థాయిల్లో పతకాలు సాధిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని