logo

భావితరాలకు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి

భారత స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే కోరుకంటి

Published : 11 Aug 2022 06:46 IST

ఫెర్టిలైజర్‌ సిటీలో నిర్వహించిన వన  మహోత్సవంలో ఎమ్మెల్యే చందర్‌ తదితరులు

ఫెర్టిలైజర్‌ సిటీ. న్యూస్‌టుడే: భారత స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. బుధవారం రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్‌షిప్‌(ఫెర్టిలైజర్‌ సిటీ)లో నిర్వహించిన వనమహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘ఫ్రీడమ్‌ పార్కు’లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం నగరపాలిక ఆధ్వర్యంలో టౌన్‌షిప్‌లో పార్కును ఏర్పాటు చేస్తున్నప్పటికీ నిర్వహణ బాధ్యతలను ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌. యాజమాన్యం తీసుకోవాలన్నారు. రామగుండంలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో అత్యధికంగా మొక్కలు నాటాల్సిన అవసరముందన్నారు. ప్రతి ఒక్కరు హరితహారంలో భాగస్వామ్యులు కావాలన్నారు. వజ్రోత్సవ సూచిక 75 ఆకారంలో నాటిన మొక్కలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లా అదనపు పాలనాధికారి(స్థానిక సంస్థలు) కుమార్‌ దీపక్‌, మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌, కమిషనర్‌ బి.సుమన్‌రావు, డిఫ్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, స్థానిక కార్పొరేటర్‌ నీల పద్మ, రామగుండం ఎరువుల కర్మాగారం అధికారులు సోమనాథ్‌, మయాంక్‌, నగరపాలక ఈఈ చిన్నారావుతో పాటు పలువురు కార్పొరేటర్లు, నగరపాలికలోని వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని