logo

బలగం నటుడు పెద్ద నర్సింగం మృతి

బలగం సినిమాలో పంచాయతీ పెద్ద (సర్పంచి)గా, ప్రముఖ కళాకారుడిగా పాత్రలు పోషించిన కీసరి నర్సింగం(75) మంగళవారం సాయంత్రం వృద్ధాప్యంతో మృతి చెందారు.

Published : 06 Sep 2023 04:34 IST

కీసరి నర్సింగం

నాగారం (కోనరావుపేట), న్యూస్‌టుడే: బలగం సినిమాలో పంచాయతీ పెద్ద (సర్పంచి)గా, ప్రముఖ కళాకారుడిగా పాత్రలు పోషించిన కీసరి నర్సింగం(75) మంగళవారం సాయంత్రం వృద్ధాప్యంతో మృతి చెందారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన ఈయన  ఇటీవల బలగం సినిమాలో పంచాయతీ పెద్దగా (సర్పంచి)గా నటించి పలువురి మన్ననలు పొందారు. చిన్నతనం నుంచి రంగస్థల నటుడిగా, కళాకారుడిగా పలు పాత్రల్లో నటించారు. మహాభారతం, రామాయణం, యక్షగానం, అల్లీరాణి, పుండరీక, మార్కండేయ జీవిత చరిత్ర వంటి నాటక ప్రదర్శనల్లో విచిత్ర వేషధారణలతో గుర్తింపు పొందారు. జిల్లా కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నర్సింగంకు భార్య భూమవ్వ, కుమారుడు శ్రీనివాస్‌, కూతురు అంజలి ఉన్నారు. బాధిత కుటుంబాన్ని సర్పంచి బాస లావణ్య, భాజపా జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్‌రావు, యాదవ సంఘం అధ్యక్షుడు ఊరడి గంగయ్య, వార్డు సభ్యులు రమాదేవి పరామర్శించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని