logo

కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల...

Published : 19 Apr 2024 04:55 IST

మంత్రి శ్రీధర్‌బాబు

మంత్రి శ్రీధర్‌బాబు, విప్‌ లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, వివేక్‌ వెంకటస్వామి, మక్కాన్‌సింగ్‌లను గజమాలతో సన్మానిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, చిత్రంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ

ధర్మపురి, న్యూస్‌టుడే: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్‌ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలన్నారు. ధర్మపురి ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. గత ఎన్నికల్లో లక్ష్మణ్‌కుమార్‌ను కుట్రలతో ఓడించారని.. ప్రజలే తిరిగి మంచి మెజార్టీతో గెలిపించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని కొప్పుల ఈశ్వర్‌ పార్లమెంటు సభ్యుడిగా ఎలా చెల్లుతారన్నారు. ఎఫ్‌సీఐలో ఉద్యోగాలు అమ్ముకున్న వారికి ఎలా ఓట్లు వేస్తామన్నారు. కొద్దినెలల్లోనే ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ రూ.75 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడతారని తెలిపారు. ధర్మపురి ప్రాంతంలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయించి సాగునీటిని అందిస్తామన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. యువకుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన భాజపాకు ఓటు వేస్తే ఇబ్బందులు తప్పవన్నారు.   ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. తనకు ఒక్క అవకాశమిస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వెళ్లి పూజలు చేశానని, స్వామి వారి సాక్షిగా పెద్దపల్లి ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ విజయంకోసం కార్యకర్తలు గడప గడపకూ తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ఎమ్మెల్సీ, నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. భారాస పాలనలో అందరూ మోసపోయారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు(పెద్దపల్లి), మక్కాన్‌సింగ్‌ (రామగుండం), కోరుట్ల ఇన్‌ఛార్జి జువ్వాడి   నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని