logo

టోల్‌ఫ్రీ నంబరు ఎలా వచ్చిందంటే..!

ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది.

Published : 29 Apr 2024 02:19 IST

ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. ఓటరు జాబితాలో తప్పొప్పులు, ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన తదితర ఫిర్యాదుల కోసం 1950 టోల్‌ఫ్రీ నంబరును ప్రవేశపెట్టింది. అయితే ఈ సంఖ్యకు ఓ ప్రత్యేకత ఉంది. దేశంలో 1950లో ఎన్నికల సంఘం(ఈసీ) ఏర్పడింది. ఈసీ ప్రారంభమైన ఏడాదికి గుర్తుగా టోల్‌ఫ్రీ కోసం ఈ నంబరును కేటాయించారు. జిల్లా స్థాయిలోని కాల్‌ సెంటరులో ఈ నంబరు ద్వారా ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తూ త్వరితగతిన పరిష్కరిస్తున్నారు. 

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని