logo

ఓటుహక్కు వినియోగంలో మహిళా చైతన్యం

2019 సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు.

Updated : 29 Apr 2024 06:14 IST

గత ఎన్నికల్లో 10 శాతం అధికంగా వారి పోలింగ్‌

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి సెగ్మెంట్లలో కలిపి మొత్తం 4,59,971 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,06,920 మంది కాగా మహిళలు 2,53,050 మంది, ఇతరులు ఒకరు. అంటే పురుషుల కన్నా 46,130 మంది మహిళలు అధికంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. మూడు సెగ్మెంట్లలో కలిపి అతివల ఓటింగ్‌ శాతం 55.01గా ఉండగా పురుషుల ఓటింగ్‌ శాతం 44.99కే పరిమితమైంది. జిల్లా నుంచి ఎక్కువ మంది పురుషులు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లడం, ముంబయి, భీవండి తదితర ప్రాంతాల్లో ఉండటం ఒక కారణమైతే స్థానికంగా ఉన్న వారు కూడా ఓటేయడానికి బద్దకిస్తుండటంతో అన్ని ఎన్నికల్లో పురుషుల పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల కోసం తాజాగా ప్రచురించిన ఓటరు జాబితాలోనూ మూడు సెగ్మెంట్ల పరిధిలో అతివలే అధికంగా ఉన్నారు. సవరణల తర్వాత 3,42,216 మంది పురుషులు, 3,70,460 మంది మహిళలున్నారు. అంటే 28,244 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. మూడు నియోజవర్గాల్లోనూ నారీమణులదే ఆధిపత్యం కావడంతో వారి ఆదరణ చూరగొనేందుకు అన్ని పార్టీల నేతలు యత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని