logo

ప్రజా శ్రేయస్సు పట్టని కాంగ్రెస్‌, భారాస

కాంగ్రెస్‌, భారాసలు ఏనాడూ ప్రజల కోసం పని చేయలేదని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

Published : 29 Apr 2024 02:27 IST

ఎంపీ బండి సంజయ్‌

మహిళకు కరపత్రాన్ని అందిస్తున్న ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

హుజూరాబాద్‌ గ్రామీణం, పట్టణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌, భారాసలు ఏనాడూ ప్రజల కోసం పని చేయలేదని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం హుజూరాబాద్‌లోని గాంధీనగర్‌ 52వ బూత్‌లో ‘ఇంటింటా భాజపా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిశారు. తాను ఎంపీగా అభివృద్ధి చేసిన పనులు, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. వినోద్‌కుమార్‌ ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దారి మళ్లించారని, ఆ విషయంపై వినోద్‌ నోరు విప్పలేదన్నారు. గతంలో అకాల వర్షాలతో రైతులు నష్టపోతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించారా అని ప్రశ్నించారు. జాతీయ రహదారి విస్తరణ పనులు ఎవరి హయాంలో వచ్చాయో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజా స£మస్యల కోసం ఎనలేని పోరాటం చేశానని, తనపై వందల కేసులున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, భాజపా కార్యకర్తలు జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి మోదీ ప్రభుత్వం రావాలి, బండి సంజయ్‌ గెలవాలని భావిస్తున్నారన్నారు. జమ్మికుంట రోడ్డులోని ఉడిపి హోటల్‌లో స్థానికులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి నాయకులు మాడ గౌతంరెడ్డి, రాజు, కరుణాకర్‌, ముత్యంరావు, సుమన్‌, శశిధర్‌, ప్రభాకర్‌, కుమార్‌, శ్రీనివాస్‌, విజయ్‌, సంజీవరెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు.

మీ నేతను.. ఎందాకైనా పోరాడతా

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌) : తాను మీరు తయారు చేసిన నాయకుడిని మీ కోసం టవర్‌సర్కిల్‌, కమాన్‌ వద్ద కొట్లాడినా.. మీరు గెలిపిస్తే ఎంపీగా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్‌లో ప్రజల పక్షాన కొట్లాడిన అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎజెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో సంఘం భవనంలో నిర్వహించిన డివిజన్‌ ఏజెంట్ల ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ఆయన మాట్లాడారు. ఎంపీగా అయిదేళ్లలో రూ.12 వేల కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జి.మనోహర్‌, ఏజెంట్ల సంఘం బాధ్యులు గట్ల అంజయ్య, రాజయ్య, ప్రభాకర్‌రావు, రంగారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని