logo

రాజ్యాంగ రక్షణకు ఉద్యమమే శరణ్యం

సమాజంలో అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని, ఆర్థిక, సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేయాలని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. బెంగళూరులోని డాక్టర్‌ అంబేడ్కర్‌ భవన్‌లో దళిత సంఘర్ష సమితి (సంయోజక) ‘రాజ్యాంగ సంరక్షణ’ అనే అంశంపై శుక్రవారం ఏర్పాటు

Published : 13 Aug 2022 01:22 IST

ఢంకా మోగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జస్టిస్‌ నాగమోహన్‌దాస్‌, సిద్ధరామయ్య,

డాక్టర్‌ మహదేవప్ప తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : సమాజంలో అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని, ఆర్థిక, సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేయాలని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. బెంగళూరులోని డాక్టర్‌ అంబేడ్కర్‌ భవన్‌లో దళిత సంఘర్ష సమితి (సంయోజక) ‘రాజ్యాంగ సంరక్షణ’ అనే అంశంపై శుక్రవారం ఏర్పాటు చేసిన సెమినార్‌ను డాక్టర్‌ అంబేడ్కర్‌ మనుమరాలు రమబాయి ఆనంద్‌ తేల్తుంబేతో కలిసి సిద్ధు ప్రారంభించి ప్రసంగించారు. మను ధర్మంపై నమ్మకం ఉన్న పాలకుల నుంచి సామాజిక న్యాయం ఆశించలేమన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నించే శక్తుల విషయంలో పీడిత వర్గాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని ఆరోపించారు. దీర్ఘకాలంగా ఆ పార్టీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మార్చివేస్తారనే అనుమానం వ్యక్తం చేశారు. అక్షర జ్ఞానానికి దూరమైన వర్గాలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలని సూచించారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ నాగమోహన్‌దాస్‌, న్యాయవాది ఆచార్య రవివర్మకుమార్‌, మాజీ మంత్రి డాక్టర్‌ మహదేవప్ప, డీఎస్‌ఎస్‌ నేతలు వి.నాగరాజు, మావళ్లి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని