logo

కడుపులో మాదక ద్రవ్యాల గుట్ట

బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు ఆఫ్రికాకు చెందిన ఓ మహిళను తనిఖీ చేసిన సమయంలో భారీగా మాదకద్రవ్యాలు వెలుగు చూశాయి.

Published : 01 Feb 2023 01:02 IST

మహిళ కడుపులో దాచిన మాదకద్రవ్య గుళికలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు ఆఫ్రికాకు చెందిన ఓ మహిళను తనిఖీ చేసిన సమయంలో భారీగా మాదకద్రవ్యాలు వెలుగు చూశాయి. ఆమె కడుపులో క్యాప్సూల్స్‌ రూపంలో ఉన్న రూ.6.68 కోట్ల విలువ చేసే 685 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఆఫ్రికా నుంచి వచ్చిన సియోరా వియోన్‌ (40) అనే మహిళను విచారిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈనెల 14న పడమటి ఆఫ్రికాలోని గినియా విమానాశ్రయం నుంచి ఆమె దుబాయి మీదుగా బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆమె ప్రవర్తన, నడక అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శరీరంలో మాదక ద్రవ్యాలు ఉండవచ్చుననే అనుమానంతో ఆసుపత్రికి తరలించి శోధించారు. వారం రోజుల తరువాత కడుపులో దాగున్న 58 గుళికలను బయటకు తీశారు. అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని