logo

చట్టసభల్లో చక్కని చోటు!

విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున నలుగురు, భాజపా నుంచి ముగ్గురు, జేడీఎస్‌ పక్షాన ఒకరు చొప్పున మహిళా ప్రతినిధులు ఈసారి విధానసౌధలో అడుగు పెట్టనున్నారు.

Published : 14 May 2023 05:39 IST

బెళగావి గ్రామీణలో విజయం సాధించిన లక్ష్మీ హెబ్బాళ్కర్‌తో మద్దతుదారులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున నలుగురు, భాజపా నుంచి ముగ్గురు, జేడీఎస్‌ పక్షాన ఒకరు చొప్పున మహిళా ప్రతినిధులు ఈసారి విధానసౌధలో అడుగు పెట్టనున్నారు. మరో స్వతంత్య్ర అభ్యర్థి లతా మల్లికార్జున (హరపనహళ్లి) స్వతంత్రంగా విజయం సాధించారు. ఈసారి ఎన్నికల బరిలో 2615 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అందులో మహిళల సంఖ్య 184. కాంగ్రెస్‌ అభ్యర్థులు.. బెళగావి గ్రామీణ నియోజకవర్గంలో లక్ష్మీ హెబ్బాళ్కర్‌, కేజీఎఫ్‌లో రూపాకళ, ముడిగెరెలో నయనా జ్యోతి విజయం సాధించారు. మహదేవపురలో భాజపా అభ్యర్థి మంజుళా లింబావళి, సుళ్యలో భగీరథి మురళయ్య, నిప్పాణిలో శశికళ జొల్లె, దేవదుర్గలో జేడీఎస్‌ అభ్యర్థి కరెమ్మ నాయక్‌ విజయం సాధించారు. ఈ తొమ్మిది మందిలో ఐదుగురు తొలిసారిగా సభాపర్వంలో అడుగు పెట్టనున్నారు. జయనగరలో సౌమ్యారెడ్డి ఆధిక్యంలో ఉన్నా.. ఇంకా ఫలితం ప్రకటించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని