logo

గెలుపు వీరులు వీరే..

కర్ణాటకలో ఎన్నికల మహా సంగ్రామం ముగిసింది. పదహారవ విధానసభలోకి అడుగు పెట్టేందుకు 2,615 మంది అభ్యర్థులు పోటీ పడగా వీరిలో సుమారుగా సుమారు రెండు వేల మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి.

Updated : 14 May 2023 06:01 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: కర్ణాటకలో ఎన్నికల మహా సంగ్రామం ముగిసింది. పదహారవ విధానసభలోకి అడుగు పెట్టేందుకు 2,615 మంది అభ్యర్థులు పోటీ పడగా వీరిలో సుమారుగా సుమారు రెండు వేల మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎన్ని ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ వస్తుందని ఎక్కువ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ కోడై కూశాయి. 39 ఏళ్లలో కన్నడ ఓటర్లు ఎప్పుడూ అధికార పార్టీని మరోసారి గద్దెను ఎక్కించలేదు. శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భాజపాకు 65, కాంగ్రెస్‌కు 136, జనతాదళ్‌కు 19, ఇతరులకు 4 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర, చిత్రదుర్గం జిల్లాల్లో గెలుపొందిన వివిధ పార్టీల అభ్యర్థుల చిత్రాలను ఇక్కడ చూడవచ్చు.

దూసుకుపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థులు

మాన్వి,న్యూస్‌టుడే : మాన్విలో కాంగ్రెస్‌ అభ్యర్థి హంపయ్యనాయక్‌, భాజపా అభ్యర్థి బి.వి.నాయక్‌ మధ్య నువ్వా నేనా అన్న విధంగా సాగిన పోరులో హంపయ్యనాయక్‌ 66,508 ఓట్లు సాధించి బీవీ నాయక్‌పై 7706ఓట్ల తేడాతో విజయం సాధించారు.  పక్క నియోజకవర్గం మస్కిలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌.బసవనగౌడ తుర్విహాళ్‌ భాజపా అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్‌పై గెలుపొందారు.  లింగసుగూరులో భాజపా అభ్యర్థి మానప్ప వజ్జల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి హూలగేరిపై, రాయచూరులో డా.శివరాజ్‌పాటిల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ శాలంపై అత్యల్ప ఓట్ల తేడాతో నెట్టుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని