logo

కల్నల్‌ జంగ్వీర్‌కు అభినందనల వెల్లువ

ఐరన్‌ మ్యాన్‌గా గుర్తింపు దక్కించుకున్న కల్నల్‌ జంగ్వీర్‌ లాంబా (53) మొరాకో సహారాలో నిర్వహించిన 38వ వార్షిక మారథాన్‌లో పతకాన్ని సాధించారు.

Published : 30 Apr 2024 01:33 IST

మారథాన్‌ పూర్తి చేసుకుని వస్తున్న లాంబా

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ఐరన్‌ మ్యాన్‌గా గుర్తింపు దక్కించుకున్న కల్నల్‌ జంగ్వీర్‌ లాంబా (53) మొరాకో సహారాలో నిర్వహించిన 38వ వార్షిక మారథాన్‌లో పతకాన్ని సాధించారు. ప్రపంచంలోని 60 దేశాల నుంచి 900 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇసుక తిన్నెల ఎడారి, రాతి మార్గాలు, ఉప్పు కొయ్యలు ఉన్న మార్గంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య 253.5 కి.మీ. దూరాన్ని ఆయన 67 గంటల ఏడు నిమిషాల్లో పూర్తి చేసి పతకాన్ని అందుకున్నారు. బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆయనను రక్షణ శాఖ అధికారులు సోమవారం అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని