logo

టేకులపల్లి చట్టసభల చుట్టం

ఏజెన్సీ మండలమైన టేకులపల్లి రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. 1952 మొదలు అనేక మంది రాజకీయ నాయకులు ఈ మండలం నుంచే ఎదిగారు.

Updated : 07 Nov 2023 04:58 IST

ఆరుగురు శాసన సభ్యులను అందించిన టేకులపల్లి

ఏజెన్సీ మండలమైన టేకులపల్లి రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. 1952 మొదలు అనేక మంది రాజకీయ నాయకులు ఈ మండలం నుంచే ఎదిగారు. ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇప్పటివరకు ఇల్లెందు, బూర్గంపాడు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన వారిలో ఆరుగురు టేకులపల్లి మండల వాసులే కావటం విశేషం. ఇంకోపక్క ముగ్గురు జడ్పీ ఛైర్మన్లను ఈ మండలమే అందించింది.


కేఎల్‌ నరసింహారావు

టేకులపల్లి మండలం బేతంపూడి స్వగ్రామం. 1952, 57లో ఇల్లెందు ఎమ్మెల్యేగా పీడీఎఫ్‌ నుంచి గెలుపొందారు. ఈ స్థానం 1962లో జనరల్‌ అయిన తరువాత మరోసారి విజయం సాధించారు. 2011లో మృతిచెందారు.


పూనెం రామచంద్రయ్య

కోయగూడెం పూనెం స్వగ్రామం. బూర్గంపాడు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1982లో ఖమ్మం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.


కొమరం రామయ్య

ముత్యాలంపాడు స్వగ్రామం. 1972లో బూర్గంపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పక్షాన శాసన సభ్యునిగా విజయం సాధించారు.


కోరం కనకయ్య

కోయగూడెం కనకయ్య స్వగ్రామం. 2014లో ఇల్లెందు నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో భారాస నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. తర్వాత స్థానిక ఎన్నికల్లో టేకులపల్లి జడ్పీటీసీగా గెలుపొందారు. ప్రస్తుతం భద్రాద్రి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.


బానోత్‌ హరిప్రియ..

దాసుతండా స్వగ్రామం. 2014లో తెదేపా నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.  2018లో ఎన్నికల్లో ఇల్లెందు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు.


దొడ్డా నరసయ్య స్వగ్రామం లచ్చగూడెం. 1972కి పూర్వం బూర్గంపాడు ఎమ్మెల్యేగా పనిచేశారు.

గోనెల నారాయణ సతీమణి విజయలక్ష్మి స్వగ్రామం ముత్యాలంపాడు. టేకులపల్లి జడ్పీటీసీగా గెలుపొందిన ఆమె 2006లో ఉమ్మడి ఖమ్మం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు.

టేకులపల్లి, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని