logo

సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు

Updated : 19 Apr 2024 05:17 IST

 మంత్రి తుమ్మలతో సమావేశమైన ఎమ్మెల్యేలు రాగమయి, జారె ఆదినారాయణ

ఇల్లెందు, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఇల్లెందులోని ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయ సమీపంలో గురువారం నిర్వహించిన మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా బలరాంనాయక్‌ శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారని, అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా ఎమ్మెల్యే, పుర ఛైర్మన్‌ బాధ్యత తీసుకోవాలన్నారు. వర్షాకాలంలోనే పంటలకు నీరివ్వని అప్పటి భారాస ప్రభుత్వం, ఎండాకాలంలో నీటి విషయంలో కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు.  డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, ఎమ్మెల్యే కోరం కనకయ్య, పుర ఛైర్మన్‌ డీవీ, కాంగ్రెస్‌ మహిళా జిల్లా అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, శ్రీకాంత్‌రెడ్డి, డానియోలు, పులి సైదులు, పత్తి స్వప్న, తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందు బస్‌ డిపోలో సమస్యలు పరిష్కరించాలని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్రగడ వంశీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతి పత్రం అందజేశారు.

దమ్మపేట: ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే కాంగ్రెస్‌ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు మట్టా రాగమయి,    జారె ఆదినారాయణతో కలిసి ఉభయ జిల్లాల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో గండుగులపల్లిలో మంత్రి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌లో చేరికల అంశంలో స్థానిక నాయకులు, కార్యకర్తలదే తుది నిర్ణయమని తెలిపారు. కందిమళ్ల కృష్ణారావు, కేవీ సత్యనారాయణ, మన్నెం అప్పారావు, కాసాని నాగప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని