logo

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు

Updated : 19 Apr 2024 05:16 IST

పుష్కరిణిలో చక్రస్నానం వేడుక
ఎర్రుపాలెం, న్యూస్‌టుడే: జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న శ్రీవేంకటేశ్వరస్వామి, అమ్మవార్లకు వేదమంత్రోచ్ఛారణ నడుమ మహా పూర్ణాహుతి అందించారు. ప్రాంగణంలో ధ్వజారోహణ చేపట్టి, శ్రీవారి పుష్కరిలో చక్రస్నానం ఆచరించారు. భక్తులకు అన్నపూర్ణ భవన్‌లో అన్నదానం అందించారు. ఆలయ ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, పుష్కరిణి నిర్మాణ దాత వెంకటేశ్వరరావు, పర్యవేక్షకురాలు విజయకుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్‌శర్మ, రాజీవ్‌శర్మ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని