logo

ఐటీఐ ప్రవేశాలకు వేళాయె..!

పదో తరగతి ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘2024-25’ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి జూన్‌ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

Updated : 19 May 2024 05:42 IST

ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్లు ఇలా..

కొత్తగూడెం రుద్రంపూర్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల

పాల్వంచ, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘2024-25’ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి జూన్‌ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటంతో పలు కోర్సులకు డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో 5,477 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్టు, కోపా, డి.ఎం. సివిల్, ఎలక్ట్రానిక్, మెకానిక్, డి.ఎం. మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్‌-మెకానిక్, డ్రస్‌ మేకింగ్, ప్లంబర్, మెకానిక్, డీజిల్, వైర్‌మెన్‌ ట్రేడ్‌లలో ప్రవేశాలకు అవకాశం ఉంది. పదో తరగతి, ఎనిమిదో తగరతి ఉత్తీర్ణులై 2024, ఆగస్టు 1వ తేదీ నాటికి 14 ఏళ్లు నిండినవారు అర్హులు. ఆసక్తి గలవారు https://iti.telangana.gov.in  వెబ్‌సైట్‌లో కోర్సులను ఎంపిక చేసుకొనే వెసులుబాటు కల్పించారు.


కేంద్ర ప్రభుత్వం తాజాగా అప్రెంటిస్‌షిప్‌ మేళాల నిర్వహణకు శ్రీకారం చుడుతోంది. విద్యతో పాటు వృత్తి నైపుణ్యాల పెంపునకు కేంద్రం శిక్షణ సంస్థల ద్వారా అవకాశాలు మెరుగయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి.   

బడుగు ప్రభాకర్, ఐటీఐ కళాశాలల కన్వీనర్,భద్రాద్రి జిల్లా 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని