Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Jun 2024 09:08 IST

1. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకే కౌంటింగ్‌ ప్రారంభమైంది. నేటితో అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల గడువు ముగియనుంది. దీంతో ముందుగానే ఓట్ల లెక్కింపు చేపట్టారు. పూర్తి కథనం

2. బెట్టింగ్‌ భూతం.. ఆడితే ఖతం

శాసనసభ పోరులో గెలుపోటములపై పందేల వేట సాగిస్తున్నారు. ఈ ఊబిలోకి సామాన్యులను సైతం వైకాపా ముఠాలు దించుతున్నాయి. వారిని ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. రూ.కోట్ల మొత్తంలో చేతులు మారుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది. నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలెవరు.. పార్టీల వారీగా విజయాలు, నేతల ఆధిక్యాలపైనా భారీగా పందేలు సాగుతున్నాయి.పూర్తి కథనం

3. ర్యానిటిడిన్‌ వినియోగంపై ఏదీ స్పష్టత?

ఛాతీలో మంట, కడుపులో గ్యాస్, అల్సర్ల నివారణకు వినియోగించే మందుల్లో ర్యానిటిడిన్‌ హెచ్‌సీఎల్‌ ఒకటి. ఈ మాత్ర ధర తక్కువే. ఓటీసీ (ఓవర్‌ ద కౌంటర్‌) అమ్మకాలు అధికం. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతో విస్తృతంగా వాడుకలో ఉంది. మన దేశంలోనూ అంతే. డాక్టర్ల సిఫారసుతో కొంతమంది వాడుతుంటే, డాక్టర్‌ చిట్టీ(ప్రిస్క్రిప్షన్‌)తో పని లేకుండా తమకు తామే మందుల షాపులో ఈ ట్యాబ్లెట్‌ తీసుకుని వినియోగించే వారెందరో. రోజులు, వారాలు, నెలల తరబడి ఈ మాత్ర వాడుతున్న వారూ కనిపిస్తారు. పూర్తి కథనం

4. అన్న పానీయాల్లో నాణ్యత ‘గోవిందా గోవింద!’

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని నిలయం తిరుమల. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా లక్షలమంది భక్తుల పూజలందుకునే స్వామి కొలువైన ఈ పుణ్యక్షేత్రం నిత్యకల్యాణం, పచ్చతోరణం. దేశ, విదేశాల్లోని హిందూ భక్తులు నిత్యం వేలల్లో తిరుమల సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. సెలవు రోజుల్లో లక్షమందికి పైగా వచ్చిన సందర్భాలూ ఎన్నో.పూర్తి కథనం

5. డ్రైవింగ్‌ లైసెన్సులు పాత విధానంలోనే

డ్రైవింగ్‌ లైసెన్సులను యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్‌ లైసెన్సింగ్‌ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. జూన్‌ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నట్లు తొలుత భావించినప్పటికీ.. అందుకు తగినట్లు ఇక్కడి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో పాత విధానంలోనే లైసెన్సులు జారీ చేయనున్నారు.పూర్తి కథనం

6. ఏజెంట్‌ 004

సజ్జల వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కేసూ నమోదయ్యింది. ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తంచేస్తున్నాయి. లెక్కింపు కేంద్రాల్లో, బయట గొడవలకు ఆస్కారం ఉందన్న వాదన వినిపిస్తుండడంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు.పూర్తి కథనం

7. బోర్డింగ్‌ పాస్‌ తీసుకున్నాక విమానం రద్దు

తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో తరచూ విమాన సర్వీసులు రద్దు అవుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజుల్లో మూడు సర్వీసులు రద్దయ్యాయి. ప్రతి రోజు రాత్రి హైదరాబాదు నుంచి ఇక్కడికి చేరుకుని తిరిగి హైదరాబాదుకు వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానాన్ని ఆ సంస్థ శనివారం సాంకేతిక కారణాలతో రద్దు చేసింది.పూర్తి కథనం

8. దశాబ్ది స్ఫూర్తిగా.. శతాబ్దికి బాసటగా

అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్‌ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. ఆ మరుపురాని క్షణాలు ఇంకా కళ్ల ముందు మెదలుతూనే ఉన్నాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో నగరం ఎంతగానో పురోగమించింది.పూర్తి కథనం

9. ఎవరూ చావు నోట్లో తల పెట్టి రాష్ట్రం తేలేదు

తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ గొప్పతనాన్ని అసెంబ్లీ మొదటి ప్రసంగంలో కేసీఆరే చెప్పారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి పదేళ్లు పూర్తయిందని, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. పూర్తి కథనం

10. 7 నిమిషాల్లో 15 వేల మెరుపులు

ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో కేవలం 7 నిమిషాల వ్యవధిలో సుమారు 15 వేల సార్లు మెరుపులు వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్స్‌కు సంబంధించిన దామిని యాప్‌ వెల్లడించింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని