logo

తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు

కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.

Published : 19 Apr 2024 02:30 IST

కర్నూలు , కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు. కర్నూలు పార్లమెంట్‌, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నామపత్రాల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. 25వ తేదీ వరకు (సెలవు దినాలు మినహా) నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందించవచ్చు. 26వ తేదీన కర్నూలు పార్లమెంట్‌కు సంబంధించి కలెక్టరేట్‌లోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామపత్రాల పరిశీలన ఉంటుంది. ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో నామపత్రాలను పరిశీలిస్తారు. 29వ తేదీన ఉపసంహరణ ఉంటుంది.  

కర్నూలు పార్లమెంట్‌ స్థానానికి తెదేపా తరఫున ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు, కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని అసెంబ్లీ స్థానాలకు తెదేపా నుంచి ముగ్గురు, వైకాపా నుంచి ఇద్దరు నామినేషన్లు వేశారు. అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఎస్‌డీపీఐ, బీఎస్పీ పార్టీల తరఫున ఒక్కొక్కరు నామపత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని