logo

వైకాపా పాలనలో వలసలే మిగిలాయి

పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.

Published : 19 Apr 2024 03:11 IST

చంద్రబాబు సభను జయప్రదం చేద్దాం

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఆలూరులో గురువారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత నారా చంద్రబాబు శుక్రవారం ఆలూరు రానున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.45 గంటలకు అగ్రహారం పరిధిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్‌ షో, అంబేడ్కర్‌ సర్కిల్‌లో సమావేశం ఉంటుందన్నారు. తెదేపా కూటమి కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజు, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడు మాట్లాడారు. సమావేశంలో కురవ జయరాం, రాంభీం నాయుడు, మల్లికార్జున, సాలిసాహబ్‌, ఉచ్చీరప్ప, రాముడు, రవి యాదవ్‌, ఈరన్న, దేవేంద్ర మండల కన్వీనర్‌ ఆశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆలూరులో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను  తెదేపా ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, జి తిక్కారెడ్డి  ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్‌తో కలిసి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు.  శ్రీకాంత్‌రెడ్డి, మల్లికార్జున, కిషోర్‌, కృష్ణమనాయుడు, కిష్టప్ప, సాలిసాహెబ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని