logo

పెత్తందారీ పాలనలో రాష్ట్రం నాశనం

పెత్తందారీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనమైందని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ ఆరోపించారు.

Published : 28 Apr 2024 02:44 IST

జగనాసుర రక్తచరిత్ర కరపత్రం చూపుతున్న మల్లెల రాజశేఖర్‌

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : పెత్తందారీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనమైందని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ ఆరోపించారు. మండలంలోని హుసేనాపురంలో జగనాసుర రక్తచరిత్ర కరపత్రాన్ని శనివారం విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో కుటుంబంపై రూ.10 లక్షల వరకు పన్నుల భారం పడిందన్నారు. ల్యాండ్‌, శాండ్‌, మైన్స్‌, గంజాయి, డ్రగ్స్‌, ఎర్రచందనం, రేషన్‌ బియ్యం తదితరాలకు సంబంధించి రూ.8 లక్షల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. జగన్‌ పదిసార్లు విద్యుత్తు బిల్లులు పెంచి రూ.75 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపాను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహబూబ్‌బాషా, వేణుగోపాల్‌, సుధాకర్‌, రామగోవిందు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని