logo

అనుమానాస్పద స్థితిలో విలేకరి మృతి

ఆత్మకూరుకు చెందిన నెత్తికొప్పుల మహేష్‌(48) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విలేకరిగా పని చేస్తున్న మహేశ్‌ పట్టణ శివారులోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు.

Published : 30 Apr 2024 00:31 IST

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే : ఆత్మకూరుకు చెందిన నెత్తికొప్పుల మహేష్‌(48) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విలేకరిగా పని చేస్తున్న మహేశ్‌ పట్టణ శివారులోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఆదివారం సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాత్రి ఇంటికి వచ్చి నిద్రించారు. సోమవారం తెల్లవారి చూసేసరికి మహేశ్‌ నిద్రించిన ఇంట్లో కాకుండా పక్కన ఉన్న ఇంటి వరండాలో మృతిచెంది పడిఉన్నారు. మృతుని ఒంటిపై దెబ్బలు ఉండటంతో ఎవరైనా హత్య చేశారా, అనారోగ్యంతో మరణించాడా అని అనుమానంగా ఉందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలు పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై వెంకట నారాయణరెడ్డి వెల్లడించారు.


తండ్రి వేధింపులకు కుమార్తె ఆత్మహత్య

రాయదుర్గం, న్యూస్‌టుడే : తండ్రి రోజూ మద్యం తాగి కుటుంబ సభ్యులను వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన అతని కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఓ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు తన కుటుంబంతో కలిసి గచ్చిబౌలి టెలికాంనగర్‌లో నివాసముంటున్నాడు. ఆయన మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా భార్య దగ్గర డబ్బులు తీసుకుని రోజూ తాగి కుటుంబ సభ్యులతో గొడవపడేవారు. తండ్రి తీరుతో విసుగెత్తిన ఆయన కుమార్తె(15) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుంది. సమీపంలో ఉండే మృతురాలి అక్క వచ్చి చూసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని