నెల రోజుల్లో ధర రెండింతలు
అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల నమోదు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కాతకు వచ్చిన పంటలపై భారీ వర్షం, వడగండ్లు పడటంతో పూర్తిగా దెబ్బతిన్నాయి.
కొనలేని స్థితిలో కూరగాయలు
కల్వకుర్తి మార్కెట్‌లో ట్రేలలో పోస్తున్న టమాటలు
కల్వకుర్తి పట్టణం, న్యూస్‌టుడే: అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల నమోదు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కాతకు వచ్చిన పంటలపై భారీ వర్షం, వడగండ్లు పడటంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్కు రావాల్సిన కూరగాయల్లో సగం కూడా రాకపోవడంతో రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి తోడు శుభకార్యాలు అధికంగా ఉండటంతో కూరగాయల వినియోగం పెరిగింది. ధరలు పెరుగుతున్నా.. రైతుకు మాత్రం దిగబడి తగ్గడంతో పెట్టుబడులు మాత్రమే వచ్చే అవకాశం ఉందంటున్నారు. వినియోగదారులు మాత్రం మార్కెట్లో ఏదీ కొనాలన్నా వెనుకడుగు వేయాల్సి వస్తోందని రూ.500 వెచ్చించినా వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదని వాపోతున్నారు. ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.60కి తక్కువ ఏవీ లేవంటున్నారు. అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లోని అన్ని మార్కెట్లలో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి ఉండనుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
వ్యాపారులకే లాభాలు..
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ నుంచి నిత్యం వివిధ ప్రాంతాలకు కూరగాయలు సరఫరా జరుగుతుంటాయి. హైదరాబాద్, శ్రీశైలంతో పాటు వారాంతపు సంత ఉండే వివిధ ప్రాంతాలకు వాహనాల్లో వ్యాపారులు తరలిస్తుంటారు. నిత్యం టన్నుల కొద్దీ కూరగాయలు వస్తుండటంతో ప్రత్యేక ట్రేలలో నింపి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. నియోజకవర్గంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నెల రోజులుగా మార్కెట్కు వచ్చే సరకు తగ్గుతుండటం, డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు రెండింతలయ్యాయి. సొరకాయ, మునగ, ఆకుకూరల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ధరల పెరుగుదలతో రైతులకు కొంతమేలవుతుండగా వ్యాపారులు అధిక లాభాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతు నుంచి కిలో టమాట రూ.12 కొనుగోలు చేసే వ్యాపారులు వినియోగదారులకు కిలో రూ.20కి విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి కూరగాయల్లో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి లాభాలు పొందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Uttar pradesh: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దళిత యువతిపై.. పోలీసు అత్యాచారం
-
Asian Games: ఆసియా క్రీడలు.. షూటింగ్లో పతకాల పంట
-
Leo: ‘లియో’ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్.. అసలు కారణమిదే..
-
S Jaishankar: ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు..: కెనడా వివాదంపై జైశంకర్ ఘాటు రిప్లై
-
NIA: ఖలిస్థానీ గ్యాంగ్స్టర్లపై విరుచుకుపడ్డ ఎన్ఐఏ.. ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు..!
-
TS TET Results: టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి