logo

నేడు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష

మహాత్మా జ్యోతిబా ఫులే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 28న టీఎస్‌ ఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌ - 2024 నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్‌ తెలిపారు.

Published : 28 Apr 2024 05:00 IST

12 కేంద్రాలు.. 2,755 మంది అభ్యర్థులు

మాట్లాడుతున్న డీఈవో రవీందర్‌, బీసీ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్‌ తదితరులు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : మహాత్మా జ్యోతిబా ఫులే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 28న టీఎస్‌ ఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌ - 2024 నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్‌ తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం ఆర్వీఎం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి 1908, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి 847 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మాధ్యాహ్నం 12.30 గంటల వరకు 12 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణకు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు డీఈవో రవీందర్‌ తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టంచేశారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. కేంద్రంలోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతించరని, హాల్‌ టికెట్‌ ఉంటేనే కేంద్రంలోకి పంపిస్తారని చెప్పారు. పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు కేంద్రంలోనే ఉండాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని