logo

దోచుకున్న సొమ్ముతో దుబాయ్‌లో పెట్టుబడులు : వంశీచంద్‌రెడ్డి

కేసీఆర్‌ కుటుంబం తెలంగాణలో పదేళ్ల పాటు దోచుకున్న సొమ్మంతా దుబాయ్‌లోని మాల్స్‌లో పెట్టుబడులు పెట్టిందని, అక్కడ అకాల వర్షాలతో మాల్స్‌ కొట్టుకుపోతే వారిలో అలజడి మొదలైందని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. 

Published : 29 Apr 2024 05:10 IST

మాట్లాడుతున్న కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, చిత్రంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

బాలానగర్‌, న్యూస్‌టుడే : కేసీఆర్‌ కుటుంబం తెలంగాణలో పదేళ్ల పాటు దోచుకున్న సొమ్మంతా దుబాయ్‌లోని మాల్స్‌లో పెట్టుబడులు పెట్టిందని, అక్కడ అకాల వర్షాలతో మాల్స్‌ కొట్టుకుపోతే వారిలో అలజడి మొదలైందని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని మోతిఘణపూర్‌, గంగాధర్‌పల్లి, మేడిగడ్డతండా, సురారం గ్రామాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో భారాస పోటీపడి దోచుకున్నాయని ఆరోపించారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావటం ఖాయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ కులం, మతం పేరిట కాదు, అభివృద్ధి, సంక్షేమ ప్రజాపాలన కోసం కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. పెద్దాయపల్లి మాజీ సర్పంచి శంకర్‌ కాంగ్రెస్‌లో చేరారు. నాయకులు శంకర్‌నాయక్‌, ప్రదీప్‌కుమార్‌గౌడ్‌, నందీశ్వర్‌, స్లోమానాయక్‌, రఫీక్‌, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని