logo

ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలి: మంత్రి

అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.

Updated : 07 Dec 2022 06:25 IST

సిద్దిపేట, న్యూస్‌టుడే: అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు, రైతులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏఈవోలకు కస్టర్ల వారీగా సాగు లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో తోటల పెంపు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3 వేల ఎకరాల్లో సాగు జరిగిందన్నారు. లక్ష్యాన్ని చేరుకునేలా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలన్నారు. 10 ఎకరాల భూవిస్తీర్ణం కలిగిన రైతులు జిల్లాలో 3215 మంది ఉన్నారన్నారు. సాగుపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు శివప్రసాద్‌, రామలక్ష్మి తదితరులు ఉన్నారు.


నిరుద్యోగ యువతకు గ్రూప్‌-4 శిక్షణ

సిద్దిపేట: గ్రూప్‌-4 ఉద్యోగాలకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువత సౌకర్యార్థం కేసీఆర్‌ ఉచిత శిక్షణా శిబిరం నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గతంలోనూ నియోజకవర్గ పరిధిలో పోలీసు, గ్రూప్‌-2, టెట్‌, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చామని, అదే తరహాలో మరోసారి తర్ఫీదు అందిస్తామన్నారు. దరఖాస్తుల స్వీకరణ మొదలైందని, ఈ నెల 9వ తేదీలోపు https:///forms.gle/3amXuGbYTZZ6TYdG9 లాగిన్‌ ద్వారా సమర్పించాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని యువతకు చక్కటి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు చరవాణి నం. 90304 33459, 85550 32916 సంప్రదించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని