logo

ఓట్లు కురిసె.. ఆధిక్యం మెరిసె..

పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ముందంజలో నిలుస్తారు. ఇదే ఎన్నికల్లోనూ వర్తిస్తుంది. తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఓట్ల ఆధిక్యమే కీలకం. అందుకే పోటీదారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారిస్తారు.

Published : 28 Apr 2024 03:23 IST

రీక్షల్లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ముందంజలో నిలుస్తారు. ఇదే ఎన్నికల్లోనూ వర్తిస్తుంది. తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఓట్ల ఆధిక్యమే కీలకం. అందుకే పోటీదారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారిస్తారు. మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన వారిలో పలువురు భారీ ఆధిక్యంతో గెలుపొందారు. మెదక్‌లో 18 సార్లు ఎన్నికలు జరగగా 11 మంది ఎంపీలు గెలుపొందారు. భారీ మెజార్టీతో గెలిచిన రికార్డు భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పేరిటే ఉంది. 2014లో 3,97,029 ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థిపై విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాతి స్థానం కొత్త ప్రభాకర్‌రెడ్డిదే. కేసీఆర్‌ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేయగా 3,61,277 ఓట్ల మెజార్టీ రావడం గమనార్హం.

న్యూస్‌టుడే, మెదక్‌, చేగుంట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని