logo

పోలింగ్‌ కేంద్రాలు.. సమగ్ర వివరాలు

ఈ సారి లోక్‌సభ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగకుండా ఉండేలా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

Published : 28 Apr 2024 03:28 IST

నా ఒక్క ఓటుతో దేశానికి ఎలాంటి లాభం ఉండదని భావిస్తున్న వారు.. ఎలాంటి నష్టం ఉండదని ఓటు హక్కు వినియోగించుకోవాలి.

జవహర్‌లాల్‌ నెహ్రూ


నా ప్రజలకు ఆయుధాన్ని చేతికందించలేదు. వారికి ఓటు హక్కే ఆయుధం. పోరాడి రాజులు అవుతారో, అమ్ముకొని ఓడిపోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌


సారి లోక్‌సభ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగకుండా ఉండేలా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద 12 అంశాలతో కూడిన వివరాలను తెలిపేలా పోస్టర్‌ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో వీటిని అతికించారు. లోక్‌సభ నియోజకవర్గం పేరు, నంబరు, అసెంబ్లీ సెగ్మెంట్‌, సంఖ్య, పోలింగ్‌ కేంద్రం వివరాలు, బీఎల్వో, సెక్టార్‌ అధికారి వివరాలు, పోలీస్‌ అధికారి పేరు, హోదా, ఫోన్‌ నంబరు, రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు సమగ్ర వివరాలు, కంట్రోల్‌రూం నంబరు ఉన్నాయి. గతంలో కేవలం అసెంబ్లీ నియోజకవర్గం నంబరు, పోలింగ్‌ కేంద్రాల సంఖ్య, బీఎల్వోల పేరు, ఫోన్‌నెంబర్‌ మాత్రమే ఉండేవి. వాటిని కూడా రంగుతో రాయించారు. ఇప్పుడు చునావ్‌ కా పర్వ్‌ 2024(ఎన్నికల పర్వం) పేరిట పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం గమనార్హం. సమగ్ర వివరాలను ఓటర్లు తెలుసుకోవడంతో పాటు అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదు చేయడానికి సులువుగా ఉంటుంది.

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని