logo

సాహితీవేత్త, విశ్రాంత ఉపాధ్యాయులు

రచయిత, సాహితీవేత్త, విశ్రాంత ఉపాధ్యాయుడు డా.కండ్లకుంట అళహ సింగరాచార్యులు (93) ఆదివారం రాత్రి కన్నుమూశారు.

Published : 14 Aug 2023 06:21 IST

డా.కండ్లకుంట అళహ సింగరాచార్యులు మృతి

అళహ సింగారాచార్యులు

ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే: రచయిత, సాహితీవేత్త, విశ్రాంత ఉపాధ్యాయుడు డా.కండ్లకుంట అళహ సింగరాచార్యులు (93) ఆదివారం రాత్రి కన్నుమూశారు. మన్సూరాబాద్‌లో సౌత్‌ ఎండ్‌ పార్క్‌ కాలనీకి చెందిన ఆయన, కొద్ది రోజులుగా లంగర్‌హౌస్‌లోని కుమారుడి వద్ద ఉంటున్నారు. ఆదివారం రాత్రి అక్కడే మృతిచెందారు. స్వస్థలం నల్గొండ జిల్లా. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుల్లో ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్‌ ఒకరు. సింగరాచార్యుల ప్రసిద్ధ రచనల్లో ‘అధ్యాపకుడి ఆత్మకథ’ ఒకటి. సోమవారం ఉదయం మృతదేహాన్ని ఎల్బీనగర్‌లోని సౌత్‌ ఎండ్‌ పార్కు కాలనీకి తీసుకురానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆటోనగర్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. సింగరాచార్యుల మృతికి తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ సంతాపం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని