logo

తండ్రీ కొడుకులు ఎమ్మెల్యేలు..

మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తండ్రీ కొడుకులు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన చరిత్ర ఉంది.

Updated : 10 Nov 2023 05:58 IST

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తండ్రీ కొడుకులు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన చరిత్ర ఉంది. మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడేనికి చెందిన తిప్పన చిన కృష్ణారెడ్డి 1962, 1967, 1972 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్‌ విజయం సాధించారు. ఆయన కుమారుడు తిప్పన విజయసింహారెడ్డి 1989లో ఎమ్మెల్యేగా విజయం గెలుపొంది 94 వరకు పనిచేశారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో సైతం 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్య ఎమ్మెల్యేగా విజయం సాధించగా ఆయన మరణం అనంతరం ఏర్పడిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు నోముల భగత్‌ విజయం సాధించారు.


నాడు సర్పంచి.. నేడు ఎమ్మెల్యే

రమావత్‌ రవీంద్రకుమార్‌

దేవరకొండ, న్యూస్‌టుడే: నియోజకవర్గ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ శేరిపల్లి పంచాయతీ రత్యతండా వాసి. ఈయన ఎం.ఏ. ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. చదువులో రాణిస్తూ మరోవైపు రాజకీయం వైపు దృష్టి సారించారు. ఎల్‌ఎల్‌బీ పూర్తయ్యాక దేవరకొండ మున్సిఫ్‌కోర్టులో కొద్దిరోజులు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1995, 2000లో స్వగ్రామం శేరిపల్లి సర్పంచిగా రెండుపర్యాయాలు గెలుపొందారు. అనంతరం సీపీఐ నుంచి 2004లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రావడంతో పోటీ చేసి గెలుపొందారు. 2014, 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఆయన ఓటమిపాలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని