logo

ద్విసభ.. పదేళ్ల ముచ్చట

లోక్‌సభకు 1951లో తొలిసారి ఎన్నికలు జరగగా హైదరాబాద్‌, ఆంధ్రా ప్రాంతానికి 1952లో జరిగాయి. మద్రాసు రాష్ట్రం పరిధిలోని ఆంధ్రా ప్రాంతానికి, హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఇద్దరు చొప్పున సభ్యులను ఎన్నుకునే వారు.

Published : 28 Apr 2024 06:10 IST

లోక్‌సభకు 1951లో తొలిసారి ఎన్నికలు జరగగా హైదరాబాద్‌, ఆంధ్రా ప్రాంతానికి 1952లో జరిగాయి. మద్రాసు రాష్ట్రం పరిధిలోని ఆంధ్రా ప్రాంతానికి, హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఇద్దరు చొప్పున సభ్యులను ఎన్నుకునే వారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం ద్విసభ నియోజకవర్గం ఉండేది. ఇక్కడ 1951లో సుంకం అచ్చాలు, 1957లో దేవులపల్లి వెంకటేశ్వర్‌రావులు పీడీఎఫ్‌ నుంచి గెలిచారు. ద్విసభ నియోజకవర్గాల నుంచి ఒకరు జనరల్‌ కేటగిరి సభ్యుడు, మరొకరు ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరి నుంచి ప్రాతినిథ్యం వహించేవారు. 1952 నుంచి 1957 వరకు రెండు పర్యాయాలు ద్విసభ ఎన్నికలు జరిగాయి. 1957లో ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతిపురం నుంచి  పోటీ చేసిన వీవీ గిరికి సమీప ప్రత్యర్థి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికి సాంకేతికంగా ఓడిపోయారు. ఇక్కడ రిజర్వుడు కేటగిరిలో పోటీచేసిన ఇద్దరు అభ్యర్థులకు వీవీ గిరి కంటే ఎక్కువ ఓట్లు రావడంతో వారిద్దరే ఎన్నికయ్యారు. వీవీ గిరి దీనిపై కోర్టుకు వెళ్లినప్పటికి ఫలితం లేకపోయింది. ఈ కారణంగానే 1961లో ద్విసభ విధానాన్ని నాటి  కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసింది. కొన్ని నియోజకవర్గాలను అచ్చంగా రిజర్వుడు వర్గాలకే కేటాయించింది.

కనగల్‌, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని