logo

ddd: మే డేను జయప్రదం చేయండి

ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డేను యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించి ఎర్ర జెండాలు ఎగురవేసి కార్మికుల ఐక్యతను చాటాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు పిలుపునిచ్చారు.

Published : 28 Apr 2024 19:33 IST

భువనగిరి: ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డేను యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించి ఎర్ర జెండాలు ఎగురవేసి కార్మికుల ఐక్యతను చాటాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు పిలుపునిచ్చారు. ఆదివారం సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం గోరేటి రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతోందని ఆరోపించారు. కేంద్రంలోని భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో  ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, నాయకులు గనబోయిన వెంకటేష్, గోపగాని రాజు, సోమన సబిత, సామల శోభన్ బాబు, దాసరి లక్ష్మయ్య పాల్గొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని