logo

డిజిటల్‌ లావాదేవీలపై నిఘా..

ఆలేరుకు చెందిన ఓ ఖాతాదారుడు భువనగిరిలో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్‌ బ్యాంకు నుంచి అధికారులు ఫోన్‌ చేశారు.

Published : 29 Apr 2024 04:15 IST

ఆలేరుకు చెందిన ఓ ఖాతాదారుడు భువనగిరిలో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్‌ బ్యాంకు నుంచి అధికారులు ఫోన్‌ చేశారు. మీ ఖాతాలో పరిమితికి మించి యూపీఐ లావాదేవీలు జరిపారని.. బ్యాంకుకు రావాలని సూచించారు. దీంతో ఖాతాదారుడు ఆందోళనకు గురయ్యాడు.


ఆలేరుకు చెందిన ఓ ఖాతాదారుడు రూ.లక్షల్లో యూపీఐ లావాదేవీలు జరిపారు. తాజాగా అతనికి బ్యాంకు అధికారులు ఫోన్‌ చేశారు. పరిమితికి మించి లావాదేవీలు జరిపారని.. మీఖాతాపై ఆంక్షలు విధిస్తామని చెప్పారు.


ఆలేరు, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరిమితికి మించి లావాదేవీలు జరుపుతున్న బ్యాంకు ఖాతాలపై ఎన్నికల కమిషన్‌ నిఘా పెంచింది. లావాదేవీల వివరాలు సక్రమంగా లేకపోతే బ్యాంకు అధికారులు సదరు ఖాతాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

సడలింపు ఇవ్వాలని కోరినా..

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలోనూ బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. ఈ సమయంలో నగదు విషయంలో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు.. బ్యాంకుల సమీపంలోనూ తనిఖీలు చేపట్టారు. సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులకు నగదు తరలింపు విషయంలో మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తులు చేసినా ఎన్నికల సంఘం అంగీకరించలేదు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ గతంలో జరిపిన బ్యాంకుల లావాదేవీలు, మూడు నెలల కిందట చేపట్టిన వాటిపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, యూపీఐ వంటి డిజిటల్‌ చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించింది.


నిబంధనల మేరకు అనుమతి ఇలా..

యూపీఐ - రూ.25వేల నుంచి రూ.లక్ష
డిపాజిట్లు- రూ.50వేలు(రోజుకు), ఏడాదికి రూ.10లక్షలు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని