logo

700 ఏళ్ల నాటి సంకెళ్ల బావి

అది చరిత్ర పుటల్లో శిథిలమైన మహానగరం.. చుట్టూ అడవి.. ఎతైన కొండలు..కోటలు.. ఇంకొంచెం తొంగిచూస్తే మరెన్నో చారిత్రక విశేషాలు.

Published : 29 Apr 2024 04:19 IST

అది చరిత్ర పుటల్లో శిథిలమైన మహానగరం.. చుట్టూ అడవి.. ఎతైన కొండలు..కోటలు.. ఇంకొంచెం తొంగిచూస్తే మరెన్నో చారిత్రక విశేషాలు.. 800 అడుగుల ఎత్తులో ఉన్న రాచకొండ ఖిల్లా పైన  సంకెళ్ల బావి ఉంది. వెలమ రాజులకు తాగు నీరందించిన మంచినీళ్ల బావి అది. ఈ ప్రాంతంలో చెరువులు కుంటలు, తటాకాలు ఎండిపోయినా ఈ బావిలో నీళ్లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ బావిలో అనేక ఔషధ గుణాలు మెండుగా ఉండటంతో ఆనాడు ఖిల్లాపైన ఉన్న రాజులు, రాణులు, మంత్రులు, ప్రముఖుల ఉద్యోగుల నివాసాలన్నింటికీ ఈ సంకెళ్ల బావి నీటినే అందించేవారు. ఈ బావిలోంచి చిన్న కాల్వల ద్వారా రాజమందిరం, అంతపురం తదితర నిర్మాణాల్లోని ప్రతి గదికి నేరుగా నీటిని పంపించనట్లు నేటికి ఆధారాలు కనిపిస్తాయి. దీని లోతు ఎవరికీ తెలియదు. అప్పట్లో రాజులు అనంత సంపదను ఈ బావిలో దాచి ఉంచారని ప్రచారం. ఈ నిధిని పొందడానికి చాలా మంది ప్రయత్నించారని.. అనేక మంది చనిపోయారని స్థానికులు అంటుంటారు. ఈ బావిలో ఏదైనా వస్తువు పడేస్తే చౌటుప్పల్‌ ప్రాంతంలోని తంగడపల్లి చెరువులో తేలుతుందని ప్రచారం ఉంది. ప్రస్తుతం ఈ బావిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోవడంతో నీరు అపరిశుభ్రంగా మారింది.           

న్యూస్‌టుడే, సంస్థాన్‌ నారాయణపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని