logo

రఘువీర్‌ 44.. నర్సయ్య 65

ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల నుంచి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నల్గొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా నిలవగా... భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు.

Published : 29 Apr 2024 04:26 IST

ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల నుంచి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నల్గొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా నిలవగా... భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు. నల్గొండ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి 53 ఏళ్లు, భాజపా అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 49, భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి 47, భారాస అభ్యర్థి క్యామ మల్లేష్‌ 59, సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ 51 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు.

న్యూస్‌టుడే, మిర్యాలగూడ పట్టణం


రెండు నియోజకవర్గాల్లో నలుగురే మహిళలు

ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో కేవలం నలుగురు మహిళలు మాత్రమే బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల నుంచి మహిళలు ఎవరూ ఎన్నికల బరిలో నిలవడంలేదు. సోషలిస్టు పార్టీ తరఫున రచ్చ సుభద్రరెడ్డి నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఇక నల్గొండ నుంచి స్వతంత్ర అభ్యర్థినులుగా పాలకూరి రమాదేవి, పోతుల ప్రార్థన బరిలో నిలవగా.. భువనగిరి నుంచి జంగా సుజాత స్వతంత్ర అభ్యర్థినిగా పోటీలో ఉన్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్నందున తుది పోరులో ఎంత మంది ఉంటారో తెలనుంది.

న్యూస్‌టుడే, మిర్యాలగూడ పట్టణం


పట్టభద్రులు ఐదుగురు

ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా, భారాస, సీపీఎం నుంచి మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలవగా.. వీరిలో ఐదుగురు అభ్యర్థులు పట్టభద్రులు. ఇద్దరు అభ్యర్థులు మాత్రం ఇంటర్‌ విద్యార్హత కలిగి ఉన్నారు. భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ ఎంఎస్‌ పూర్తి చేయగా.. నల్గొండ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి బీఏ ఎల్‌ఎల్‌బీ, ఎంఏ పూర్తి చేశారు. నల్గొండ భాజపా అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి బీఎస్సీ, భువనగిరి సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ డిగ్రీ పూర్తి చేయగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేశారు.

న్యూస్‌టుడే, మిర్యాలగూడ పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని