logo

లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూములు సిద్ధం

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అవసరమైన కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూములు సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తెలిపారు.

Published : 28 Apr 2024 02:40 IST

ప్రియదర్శిని కళాశాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎన్నికల పరిశీలకులు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అవసరమైన కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూములు సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తెలిపారు. శనివారం నెల్లూరు రూరల్‌ మండలం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్‌కుమార్‌ గౌతమ్‌, నితిన్‌ సింగ్‌ బదూరియాలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు కళాశాలలోని నార్త్‌బ్లాక్‌లో నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, కోవూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్‌, స్ట్రాంగ్‌ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సౌత్‌బ్లాకులో సర్వేపల్లి కౌంటింగ్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూము ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ సంజనా సింహ, నగరపాలకసంస్థ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌, ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌, అదనపు ఎస్పీ సౌజన్య, తహసీల్దారు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని