logo

సమకూరని మౌలిక వసతులు

మండలంలోనే పెద్ద పంచాయతీ బ్రాహ్మణక్రాక అరుంధతి వాడలోని అంతర్గత రోడ్డు ఇది. మురుగు నీటి కాలువలు పూడి పోయాయి. దిగువ ప్రాంతాలకు మురుగు పారక..రోడ్డుపై నిల్వ ఉంది. కాలనీ వాసులు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

Published : 29 Apr 2024 03:55 IST

మండుటెండల్లో మురుగు సమస్య

మండలంలోనే పెద్ద పంచాయతీ బ్రాహ్మణక్రాక అరుంధతి వాడలోని అంతర్గత రోడ్డు ఇది. మురుగు నీటి కాలువలు పూడి పోయాయి. దిగువ ప్రాంతాలకు మురుగు పారక..రోడ్డుపై నిల్వ ఉంది. కాలనీ వాసులు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

జలదంకి, న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వం గత అయిదేళ్లుగా పంచాయతీల నిధులను దారి మళ్లించటంతో గ్రామాలు మౌలిక వసతులకు నోచుకోలేదు. నిధుల లేమితో గ్రామాల్లో అభివృద్ధి పనులు అట కెక్కాయి. ఆర్థిక సంఘం నిధులను సైతం విద్యుత్తు బిల్లుల చెల్లింపుల పేరుతో ప్రభుత్వం జమ చేసుకోవటంతో అంతర్గత రోడ్లు, మురుగు నీటి కాలువల్లో పూడికతీత పనులు అటకెక్కాయి. దీంతో గ్రామాలు దుర్గంధంతో సతమతమవుతున్నాయి.  ‌్ర మండల పరిధి చామదల, అన్నవరం, జమ్మలపాలెం, బ్రాహ్మణక్రాక, చోడవరం, జలదంకి, వేములపాడు పంచాయతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మురుగు నీటి కాలువలు సైతం పూడిపోయాయి. దీంతో కొద్దిపాటి వర్షానికే అంతర్గత రోడ్లు చిత్తడిగా మారి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పూడికతీత పనులు, అంతర్గత రోడ్లు నిర్మించాలని సర్పంచులను కోరినా నిధులు లేవని చెబుతున్నారు.


మురుగు ఇబ్బందులు
- పాజర్ల లక్ష్మమ్మ, బ్రాహ్మణక్రాక

గ్రామంలోని అరుంధతివాడలో అంతర్గత రోడ్ల పక్క నిర్మించిన మురుగు నీటి కాలువలు పూడిపోయాయి. దీంతో ఎగువ నుంచి వచ్చే మురుగు దిగువకు పారక రోడ్డుతోపాటు నివాసాల ముందు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. రోడ్డుపై మురుగు నీటిలోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. సమస్యను అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.


అంతర్గత రోడ్లు నిర్మించాలి
- ఏగూరు రఘు, జలదంకి

జలదంకి అరుంధతి వాడలో మురుగు నీటి కాలువలు, అంతర్గత రోడ్లు నిర్మించాలని అధికారులు, పాలకులను వేడుకున్నా ప్రయోజనం లేదు. అంతర్గత రోడ్లు సక్రమంగా లేక పోవటంతో కొద్దిపాటి వర్షం కురిసినా రహదారులపై వరద నీరు చేరుతోంది. బురద నీటిలోనే నడవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాను నిధుల ద్వారా కాలనీల్లో సిమెంట్‌ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించటంలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని