logo

రెండో రోజు.. ఆరుగురు

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన భారాస, భాజపా అభ్యర్థులున్నారు.

Published : 20 Apr 2024 06:48 IST

భారాస, భాజపా అభ్యర్థుల నామపత్రాల దాఖలు

 రిటర్నింగ్‌ అధికారి రాజీగాంధీ హన్మంతుకు నామపత్రాలు అందజేస్తున్న కండెల సుమన్‌ (ధర్మ సమాజ్‌ పార్టీ), శ్రీనివాస్‌ (బహుజన్‌ ముక్తి పార్టీ), బాజిరెడ్డి గోవర్ధన్‌ (భారాస),  ధర్మపురి  అర్వింద్‌ (భాజపా)

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన భారాస, భాజపా అభ్యర్థులున్నారు.

  •  భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. మొదటి సెట్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్‌.సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాతో కలిసి రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. రెండో సెట్‌ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జగిత్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి ఆయేషా ఫాతిమాతో కలిసి వేశారు.
  •  భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ పసుపు రైతులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. పసుపు రైతులు రమేశ్‌ (వన్నెల్‌), తిరుపతిరెడ్డి(జగిత్యాల), నర్సన్న(ఆర్మూర్‌), తిరుపతిరెడ్డి(కోరుట్ల)తో కలిసి నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతుకు అందించారు. మెడలో పసుపుతో అల్లిన దండ వేసుకున్నారు
  • స్వతంత్ర అభ్యర్థులు రాపెల్లి శ్రీనివాస్‌, రాగి అనిల్‌, బహుజన్‌ ముక్తి పార్టీ తరఫున దేవతి శ్రీనివాస్‌, ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థి కండెల సుమన్‌ నామినేషన్‌ వేసిన వారిలో ఉన్నారు. నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన రెండు రోజుల్లో ఎనిమిది మంది నామినేషన్లు వేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు