logo

వీడని వాన

ఉమ్మడి జిల్లాను అకాల వర్షాలు వీడటం లేదు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వరుసగా కురుస్తున్న వానలు అన్నదాతలకు కునుకులేకుండా చేస్తున్నాయి. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం పడింది.

Updated : 23 Apr 2024 06:59 IST

కొనసాగుతున్న ద్రోణి

అన్నదాతల అష్టకష్టాలు

 దోమకొండలో పిడుగుపాటుకు దహనమవుతున్న తాటి చెట్టు

న్యూస్‌టుడే, కామారెడ్డి, నిజామాబాద్‌ వ్యవసాయం: ఉమ్మడి జిల్లాను అకాల వర్షాలు వీడటం లేదు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వరుసగా కురుస్తున్న వానలు అన్నదాతలకు కునుకులేకుండా చేస్తున్నాయి. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. అత్యధికంగా మాక్లూర్‌ మండలం మదన్‌పల్లిలో 18.5, పెద్దకొడప్‌గల్‌లో 18.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బిచ్కుంద మండలం పుల్కల్‌లో 15.3, పిట్లంలో 9.0, పాత రాజంపేటలో 8.0, మచ్చర్లలో 6.3 మి.మీ. కురిసింది. దోమకొండ, పొతంగల్‌, నందిపేట్‌, నవీపేట, డొంకేశ్వర్‌, ఆలూర్‌, ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి మండలాల్లో ఉరుములు, మెరుపులతో చినుకులు పడ్డాయి. ఒక్కసారిగా వచ్చిన చినుకులతో కల్లాలపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కుప్పలు చేసుకొని తాటిపత్రులు కప్పే లోపే వర్షం బారినపడింది. ఈదురుగాలులకు చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దోమకొండలో పిడుగుపాటుకు ఓ కొబ్బరిచెట్టు కాలిపోగా, నవీపేట మండలం మోకన్‌పల్లిలో ఆవు మృత్యువాత పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని