logo

విస్తృతంగా వాహనాల తనిఖీ

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.

Published : 27 Apr 2024 21:57 IST

ఎల్లారెడ్డి పట్టణం: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. శనివారం పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద  పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ నిబంధనల మేరకు రూ.50 వేల కంటే ఎక్కువగా డబ్బు రవాణా చేస్తే తప్పనిసరిగా ఆ నగదుకు సంబంధించిన రసీదు ఉండాలన్నారు. వాహనదారులందరూ కూడా నంబర్ ప్లేటు, సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 30 వాహనాలను జప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై మహేష్, ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని