logo

నెల రోజుల్లో చక్కెర పరిశ్రమలు తెరిపిస్తా

ఎంపీగా మళ్లీ గెలిపిస్తే నెలరోజుల్లోనే చక్కెర పరిశ్రమలు తెరిపిస్తానని నిజామాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ అన్నారు.

Published : 28 Apr 2024 05:30 IST

ఆర్మూర్‌లో జరిగిన కిసాన్‌ మోర్చా సమ్మేళనంలో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఎంపీగా మళ్లీ గెలిపిస్తే నెలరోజుల్లోనే చక్కెర పరిశ్రమలు తెరిపిస్తానని నిజామాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ అన్నారు. శనివారం ఆర్మూర్‌ పట్టణంలో నిర్వహించిన కిసాన్‌ మోర్చా సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ హయాంలో దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీగా గెలుపొంది ఒక్కసారైనా నిజామాబాద్‌కు వచ్చారా అని ప్రశ్నించారు. రైతుల కోసం చేసిన ఒక మంచి పని చెబితే రాజకీయాలు వదిలి వెళ్తానని పేర్కొన్నారు. అన్నదాత చిరకాల కోరిక మేరకు ప్రధాని మోదీ నిజామాబాద్‌ వచ్చి పసుపు బోర్డు ఇచ్చారని, పసుపు ధర సైతం పెరుగుతూనే ఉంటుందని, పరిశ్రమలు వచ్చి, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పసుపు బోర్డు నిజామాబాద్‌ గడ్డపై ఏర్పడుతోందని స్పష్టం చేశారు. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి చక్కెర ఫ్యాక్టరీని ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. అవినీతి కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓట్ల కోసం దేవుడిపై ఒట్టు వేయడం సరికాదన్నారు. రేపోమాపో ఓటుకు నోటు కేసులో ఆయనను జైల్లో వేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గంగారెడ్డి, సీనియర్‌ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, భూపతి రెడ్డి, యామాద్రి భాస్కర్‌, కోటపాటి నర్సింహంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని