logo

‘ఓర్వలేక బిల్లులు ఆపేశారు’

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కొన్ని బిల్లులు ఆపేశారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మోస్రా, చందూర్‌, వర్నిల్లో శనివారం రాత్రి ఆయన రోడ్‌ షో నిర్వహించారు.

Published : 28 Apr 2024 05:34 IST

చందూర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

చందూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కొన్ని బిల్లులు ఆపేశారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మోస్రా, చందూర్‌, వర్నిల్లో శనివారం రాత్రి ఆయన రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నమ్ముకుని ఇళ్లు కట్టుకున్న వారి కోసం ఎన్నికల తర్వాత కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తానని, ప్రాణత్యాగానికి సైతం సిద్ధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదని, ఆ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. హామీలు, రుణమాఫీపై మాజీ మంత్రి హరీశ్‌రావు విసిరిన సవాలును సీఎం స్వీకరించలేదని, ఇక ఆయన ప్రజలకు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల్లో సగం కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పేదలు, వృద్ధులు, మహిళలు, యువకులకు ఏం చేసిందన్నారు. పార్టీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గాలి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఒకసారి అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగాలు, పరిశ్రమలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో భారాస నియోజకవర్గ ఇన్‌ఛార్జి భాస్కర్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, గోపి, హన్మంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీరాములు, అంబర్‌సింగ్‌, గిరి, గోపాల్‌, హరిదాసు, లావణ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని