logo

ఇంటికే ఓటరు చీటీలు

పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఒప్పటికే ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. పోలింగ్‌ రోజు అవసరమైన పోల్‌ చీటీలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు.

Published : 28 Apr 2024 05:52 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌: పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఒప్పటికే ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. పోలింగ్‌ రోజు అవసరమైన పోల్‌ చీటీలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బీఎల్‌వోలు తమ పరిధిలో ఓటర్లకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మే 13న పోలింగ్‌ జరగనుంది. ఇది వరకు పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు వీటిని పంపిణీ చేసేవారు. ఈ సారి ఆ ప్రక్రియ ముందే చేపట్టాలని ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశించడంతో అధికారులు కదిలారు. బీఎల్‌వోల పరిధిలో ఎన్ని ఓట్లు ఉన్నాయో.. ఆ మేరకు చీటీలు అందించారు. వారు అందులోని చిరునామాల మేరకు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఓటరుకు చేరవేయాలని అధికారులు ఆదేశించారు.

1950కు ఫోన్‌ చేయండి

మీ ఇంటికి పోల్‌ చీటీ రాలేదని ఆందోళన చెందాల్సిన పని లేదు. స్థానికంగా ఉండే బూత్‌ స్థాయి అధికారి(బీఎల్‌వో)ని సంప్రదించాలి. వారు ఇవ్వకుంటే టోల్‌ఫ్రీ నంబరు 1950కు ఫోన్‌ చేసి కంట్రోల్‌ రూంలో మీ వివరాలు తెలియజేయాలి. వారు అందేలా చూస్తారు. లేకుంటే మీ చరవాణిలో ఈఎస్‌ఈ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి మీ ఎన్నికల గుర్తింపు కార్డు నంబరు నమోదు చేసి 1950కు ఎస్‌ఎంస్‌ చేయాలి. కొద్ది సేపటికే మీ చరవాణికి చీటీ వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు